News December 6, 2024
అల్లు అర్జున్‌కు జైలు శిక్ష పడుతుందా?
HYD సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి PSలో కేసు నమోదైంది. BNS చట్టంలోని సెక్షన్ 105(హత్య కాని ప్రాణనష్టం కేసు), 118(1) వంటి నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. బన్నీ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి.
Similar News
News December 27, 2024
GREAT: 90 ఏళ్ల వయసులో వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు!
గతేడాది కేంద్రం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పొడిగించేందుకు ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాసైతే ఢిల్లీ అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని, అడ్డుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థించారు. 90 ఏళ్ల వయసు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. మన్మోహన్ అంకితభావాన్ని ప్రధాని మోదీ సైతం కొనియాడారు.
News December 27, 2024
షాకింగ్: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్
TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్‌పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్‌ను బ్లాక్ చేసింది.
News December 27, 2024
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.