News December 6, 2024

రాహుల్, సొరోస్ ఏక్‌ హై: BJP ఎదురుదాడి

image

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై BJP ఎదురుదాడికి దిగింది. ఆయనను భారత వ్యతిరేకి జార్జి సొరోస్ చేతిలో కీలుబొమ్మగా వర్ణించింది. US డీప్‌స్టేట్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నట్టు పేర్కొంది. ఈ కనెక్షన్లపై BJP4INDIA హ్యాండిల్లో సుదీర్ఘ ట్విటర్ థ్రెడ్స్ క్రియేట్ చేసి స్క్రీన్‌షాట్లను ఉంచింది. సొరోస్, ఓపెన్ సొసైటీ, OCCRP, డీప్ స్టేట్ ప్రతినిధులను రాహుల్ సీక్రెట్‌గా కలవడం, భారత్ జోడో యాత్రలో వారి హస్తంపై వివరించింది.

Similar News

News December 27, 2024

మన్మోహన్ విలక్షణ పార్లమెంటేరియన్: మోదీ

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ ఆయన సేవలను కొనియాడారు. దేశం, ప్రజల పట్ల ఆయన అంకితభావం స్మరించుకోదగిందన్నారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారని గుర్తు చేశారు. ఆర్బీఐ గవర్నర్‌ సహా అనేక కీలక పదవులు చేపట్టినా సామాన్య జీవితం గడిపారని కొనియాడారు. ఆయనో విలక్షణ పార్లమెంటేరియన్ అని మోదీ కీర్తించారు.

News December 27, 2024

మన్మోహన్ జీవితం ఎందరికో స్ఫూర్తి

image

మన్మోహన్ సింగ్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఆధునిక భారతదేశ పితామహుడిగా మార్చింది చదువు, తెలివితేటలే. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన తర్వాత ఆయన జ్ఞానానికి ముగ్ధుడై సింగ్‌కు సెండాఫ్ ఇచ్చేందుకు వైట్‌హౌస్ బయటకొచ్చి గౌరవించారు. 2014లో మాజీ ప్రధాని అయ్యాక జపాన్‌ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించారు.

News December 27, 2024

US: 240 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా

image

అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్‌ను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు. 1782 నుంచి ఈ పక్షిని అమెరికా చిహ్నంగా వాడుతున్నా అధికారిక హోదా మాత్రం కల్పించలేదు. 240 ఏళ్ల తర్వాత బైడెన్ దీనికి ఇటీవల ఆమోద ముద్ర వేశారు. ఈ పక్షికి తెల్లటి తల, పసుపు రంగు ముక్కు, గోధుమ రంగులో శరీరం ఉంటుంది.