News December 6, 2024
NLG: గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు

నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టారు. రెండ్రోజులుగా సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 6, 2026
యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

మిర్యాలగూడ మండలం తుంగపాడులోని NDR యూరియా గౌడన్, NDCMS ఎరువుల దుకాణాలను మంగళవారం నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. యూరియా యాప్ రైతులు ఎలా వాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు నిత్యం యూరియా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, వ్యవసాయ అధికారులు ఉన్నారు.
News January 6, 2026
హెల్మెట్ లేదంటే.. చుక్క పెట్రోల్ పోయరు: నల్గొండ ఎస్పీ

ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలు చేయనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయరాదని ఇప్పటికే అన్ని బంకు యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.
News January 6, 2026
NLG: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

కారు, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి వద్ద KDD-జడ్చర్ల రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతుడు పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాలకి చెందిన మారుపాక గణేష్‌గా గుర్తించారు. గణేష్ అంగడిపేట ఎక్స్ రోడ్డులోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


