News December 6, 2024

ఏం సాధించారని రేవంత్ సంబరాలు: ఈటల

image

TG: ఏం సాధించారని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని BJP MP ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ‘హోదా మరిచి రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు రేవంత్ రెడ్డి దుర్మార్గాలపై నిర్వహిస్తున్న సభకు జేపీ నడ్డా వస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు డ్రామా ఆడుతున్నాయి. ఎవరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారో బయటపెట్టాలి. రేపటి ఆటో డ్రైవర్ల సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోంది’ అని ఈటల అన్నారు.

Similar News

News March 18, 2026

ఆర్డర్ చేస్తే ‘ఎండ’ డెలివరీ.. రాత్రి కూడా పట్టపగలు!

image

రాత్రిపూట ఫుడ్ ఆర్డర్ చేసినట్లుగానే ఇకపై ఎండను కూడా ఆర్డర్ చేయొచ్చు. కాలిఫోర్నియా స్టార్టప్ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ స్పేస్‌లో భారీ అద్దాలతో కూడిన శాటిలైట్లను ప్రయోగించి సూర్యరశ్మిని భూమిపైకి మళ్లించనుంది. గంటకు ₹4.5 లక్షలు చెల్లిస్తే రాత్రి కూడా పట్టపగల్లా వెలుగొస్తుంది. 2035 నాటికి 50,000 శాటిలైట్లను పంపడమే లక్ష్యం. ఈ కృత్రిమ వెలుతురు వల్ల పర్యావరణానికి, పరిశోధనలకు ముప్పు కలుగుతుందనేది ఆందోళన.

News March 18, 2026

TODAY HEADLINES

image

☛ రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG: CM CBN
☛ చంద్రబాబు తీరువల్లనే డ్రగ్స్ దందాలు: జగన్
☛ మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన TG ప్రభుత్వం
☛ KCR కూడా డ్రగ్ టెస్ట్‌కు రావాలి: TPCC చీఫ్
☛ ఆరు గ్యారంటీల ఫైల్ ఎక్కడ? కాకి ఎత్తుకెళ్లిందా?: KTR
☛ ఇంకా ఆందోళనకరంగానే గ్యాస్ నిల్వలు: కేంద్రం
☛ అఫ్గాన్‌పై పాక్ దాడులు.. ఖండించిన భారత్

News March 18, 2026

UG, PG విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులు

image

TG: రాష్ట్రంలోని విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. UGలో 19, PGలో 10 కోర్సులు, AEDP(అప్రెంటిస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 2030 నాటికి వివిధ రంగాల్లో 20L ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని, వాటిని సాధించేలా యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.