News December 6, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

image

సూర్య నటించిన కంగువా మూవీ OTT స్ట్రీమింగ్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా డిసెంబర్ 13 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

Similar News

News April 16, 2026

41-44°C టెంపరేచర్.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో 41-44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో 36-40°C వరకు టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. జిల్లాల వారీగా వివరాలను రెండో ఫొటోలో చూడొచ్చు.

News April 16, 2026

కరోండా జీవకంచెతో అనేక లాభాలున్నాయ్

image

కరోండా ముళ్లతో నిండి ఉండటం వల్ల పశువులు, మేకలు, అడవి పందులు, కుందేళ్లు ఈ కంచెను దాటలేవు. ఈ మొక్క వేర్లు మట్టిని బలంగా పట్టుకుంటాయి. ఫలితంగా ఇవి నేల కోతను, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. పంటకు అవసరమైన తేమను నిల్వ ఉంచుతాయి. ఈ పొదల్లో పక్షులు గూళ్లు కట్టుకొని రకరకాల పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. తేనెటీగలు ఈ పూలపై తిరుగుతాయి. వీటి వల్ల పొలాల్లో పరాగసంపర్కం జరిగి పంట దిగుబడి పెరుగుతుంది.

News April 16, 2026

APPLY NOW: BECILలో 28 పోస్టులు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌-26, పెర్ఫ్యూషనిస్ట్‌-2 పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(BECIL) నోటిఫికేషన్ ఇచ్చింది. BSc(MLT), BSc పెర్ఫ్యూషన్‌ టెక్నాలజీ సర్టిఫికెట్, ఏడాది ఉద్యోగ అనుభవం, 21-40 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేయొచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు 27-4-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.becil.com చూడండి.