News December 6, 2024

విజయనగరం: పెరిగిన గుడ్డు ధర..! 

image

గుడ్డు ధర భారీగా పెరిగింది. విజయనగరం రైతు బజారులో రూ.6.34కు విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో రూ.7 అమ్ముతున్నారు. కాగా.. విజయనగరం రైతు బజారులో శుక్రవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. (KGలో) వంకాయ రూ.35, టమాటా రూ.45-48, బెండ రూ.30, కాకర రూ.35, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.38, క్యారెట్ రూ.55-70, దొండకాయలు రూ.30కి అమ్ముతున్నారు. మరి మీ దగ్గర కూరగాయలతో పాటు గుడ్డు ధర ఎంత ఉందో కామెంట్ చెయ్యండి.

Similar News

News April 3, 2026

దొంగతనాలు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: VZM SP

image

వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ శుక్రవారం సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే వారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (LHMS) సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇళ్లకు బలమైన తాళాలు వేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, రాత్రివేళల్లో లైట్లు వెలిగేలా చూడాలన్నారు.

News April 3, 2026

VZM: పారిశ్రామిక అభివృద్ధికి భూముల పరిశీలన

image

విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక & వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, JC ఎస్.సేధు మాధవన్‌లతో కలిసి రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలోని ఏపీఐఐసీ భూములను పరిశీలించారు. అభివృద్ధికి అనుకూలంగా భూముల వినియోగంపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News April 3, 2026

VZM: ఆ ఉద్యోగులకు నేటి నుంచి సెలవులు లేవు

image

వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి నేటినుంచి సెలవులు లేవని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అధికారులు తెలియజేశారు. వైద్యసేవ ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మెలో పాల్గొనడం వల్ల జిల్లాలో వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు జిల్లా సమన్వయ అధికారి సాయిరాం తెలిపారు. నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించే వరకు సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహించాలని కోరారు.