News December 6, 2024
హరీశ్ రావు మానసిక స్థితి బాలేదు: కోమటిరెడ్డి

TG: మాజీ మంత్రి హరీశ్ రావు మానసిక స్థితి బాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓ చిల్లర MLA గురించి ఇంత డ్రామా అవసరమా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఏ హోదాలో హరీశ్ రావు ప్రశ్నిస్తున్నారని అడిగారు. ‘మేం ఉద్యమాల నుంచి వచ్చిన MLAలం. వీధి నాటకాల MLAలు మీరు’ అని మండిపడ్డారు. శాంతిభద్రతల సమస్య తేవాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు.
Similar News
News March 21, 2026
యశ్ దయాల్‌కు షాక్ ఇచ్చిన RCB!

మరో వారంలో IPL ప్రారంభం కానుండగా RCB కీలక బౌలర్ యశ్ దయాల్ ప్రాక్టీస్ క్యాంపులో కనిపించకపోవడం చర్చకు దారి తీస్తోంది. ఆయనపై రేప్ <<17189705>>ఆరోపణలు<<>> ఉన్న నేపథ్యంలో జట్టు నుంచి తప్పించి ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఇక టీమ్ ట్రావెల్ బస్సుపై యశ్ మినహా మిగతా ప్లేయర్లందరి ఫొటోలు ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. అటు దయాల్ గత నెల రహస్యంగా పెళ్లి చేసుకోగా ఇటీవల ఆ విషయం బయటికొచ్చిన విషయం తెలిసిందే.
News March 21, 2026
రాష్ట్రంలో నాన్‌వెజ్.. నాన్‌స్టాప్!

TG: రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2013-14లో 2.30 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2024-25 నాటికి 11.12 లక్షల టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. 2019 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.26 కోట్ల పశుసంపద ఉందని తెలిపింది. గొర్రెల సంఖ్యలో దేశంలోనే తొలి స్థానంలో, పౌల్ట్రీలో మూడో ప్లేస్‌లో నిలిచినట్లు చెప్పింది.
News March 21, 2026
బడ్జెట్‌లో మైక్రో SUV.. సరికొత్తగా ఎక్స్‌టర్

మధ్యతరగతి ఫ్యామిలీలే టార్గెట్‌గా మార్కెట్లోకి హ్యుందాయ్ సరికొత్త ఎక్స్‌టర్‌ను తీసుకొచ్చింది. ఈ మైక్రో SUV ప్రారంభ ధరను రూ.5,79,000(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే కాస్త డిజైన్ ఛేంజెస్ చేసింది. తొలిసారి డ్యాష్‌క్యామ్ ఫీచర్ తీసుకొచ్చింది. స్పోర్టీ డీ-కట్ స్టీరింగ్ వీల్, లాంగ్ వీల్‌బేస్, 4 సిలిండర్ 1.2 కప్పా పెట్రోల్ ఇంజిన్ సహా 25రకాల మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.


