News December 6, 2024
‘గరం మసాలా’ గురించి మీకీ విషయం తెలుసా!

గరం మసాలాతో భారతీయుల బంధం ఈనాటిది కాదు. కొన్ని వేల ఏళ్ల కిందటే ఆహారంలో దీనిని భాగం చేసుకున్నారు. మితంగా తింటే ఔషధంగా పనిచేసే ఈ దినుసుల కోసం యుద్ధాలే జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 36 మసాలా పొడులను పరీక్షించిన టేస్ట్ అట్లాస్ భారతీయ గరం మసాలాకు రెండో ర్యాంకు ఇచ్చింది. ఇక చిలీలో దొరికే చిల్లీ పెప్పర్ అజితో చేసిన పొడికి NO1 ర్యాంకు కట్టబెట్టింది. జాటర్, జెర్క్, షిచిమి టొగారషి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్‌లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని <
News September 18, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?