News December 6, 2024

రిషభ్ పంత్ ఇప్పుడు నా సహచరుడు: లాంగర్

image

ఆస్ట్రేలియాలో భారత్ గత పర్యటనల సమయంలో రిషభ్ పంత్ తనకు పీడకలలు మిగిల్చారని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మాత్రం పంత్ తనకు ప్రత్యర్థి కాదని, మంచి సహచరుడయ్యారని తెలిపారు. ఆస్ట్రేలియాలో గత రెండు BGT సిరీస్‌లలోనూ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించారు. లాంగర్ కోచ్‌గా ఉన్న LSG జట్టు IPL వేలంలో ఆయన్ను కొనుగోలు చేసింది.

Similar News

News October 30, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. వేడి చేసిన నీటినే తాగండి

image

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని అధికారులు సూచించారు. తద్వారా వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ సమయంలో జ్వరం బారిన పడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.

News October 30, 2025

న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ ప్రారంభించండి: ట్రంప్

image

US తక్షణమే న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ ప్రారంభిస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. తాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇతర అణుశక్తి దేశాల చర్యలకు సమాధానంగా తామీ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘న్యూక్లియర్ వెపన్స్‌లో అగ్రస్థానంలో అమెరికా ఉంది. తర్వాత రష్యా, చైనా ఉన్నాయి. కానీ ఐదేళ్లలో పరిస్థితి మారొచ్చు. నాకిది ఇష్టం లేకపోయినా తప్పట్లేదు’ అని తెలిపారు.

News October 30, 2025

ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు పరార్

image

దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ ప్రొడక్ట్స్ వాడతాం. వీటి ప్రభావం మనపై కూడా పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. బంతి, తులసి, లావెండర్, రోజ్మేరీ, కలబంద మొక్కలు దోమలను తరిమేయడంలో సహకరిస్తాయి. అలాగే ఇంటి బయట వేప, యూకలిప్టస్ చెట్లను పెంచినా దోమల బెడద తగ్గుతుందంటున్నారు నిపుణులు.