News December 6, 2024
తెలంగాణ తల్లి రూపం ఇదే..

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వైరల్ అవుతోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న కంకులు పట్టుకున్న రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అయితే విగ్రహ రూపాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
Similar News
News March 13, 2026
సీఎం రేవంత్ ఎంత ఐటీ చెల్లించారంటే?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందే జీతంపై ఆదాయపు పన్ను చెల్లించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సీఎం తరఫున ప్రభుత్వం రూ.1,04,054 పన్ను చెల్లించింది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే సాధారణ పరిపాలన శాఖ (GAD) సీఎం, మంత్రుల ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసి పన్నులు చెల్లిస్తుంది.
News March 13, 2026
షేమ్ ఆన్ యూ కావ్యా మారన్.. SMలో ట్రోలింగ్

హండ్రెడ్ లీగ్ సన్‌రైజర్స్‌లోకి PAK బౌలర్ <<19368622>>అబ్రార్‌ను<<>> తీసుకోవడంతో ఓనర్ కావ్యా మారన్‌పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాక్ ప్లేయర్‌ను కొనడం టెర్రరిజాన్ని ప్రోత్సహించడమేనని మండిపడుతున్నారు. ‘Shame on you kavya maran’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై BCCI వైస్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. IPL మినహా ఇతర లీగుల్లో ఎవరిని తీసుకోవాలనేది ఫ్రాంచైజీల ఇష్టమన్నారు.
News March 13, 2026
జైశంకర్ స్కెచ్.. అగ్రరాజ్యానికి బ్రిక్స్ చెక్?

విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు BRICS విషయాలు చర్చించినట్లు వెల్లడించారు. US/ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జైశంకర్ వరుసగా ఇరాన్‌తో చర్చలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఏకపక్ష నిర్ణయాలతో, ఆధిపత్య వైఖరిని ప్రదర్శిస్తున్న USకు చెక్ పెట్టడమే లక్ష్యంగా BRICSను బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.


