News December 6, 2024
12వేల ఏళ్ల క్రితమే కుక్కలతో మనిషి బంధం: అధ్యయనం

కుక్కలు, మనుషుల మధ్య బంధం 12వేల ఏళ్ల క్రితమే ఉందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అలాస్కాలో లభించిన 12వేల ఏళ్ల నాటి కుక్కల కాలి ఎముకలపై వారు అధ్యయనం నిర్వహించారు. వాటి ఎముకల్లో సాల్మన్ చేప ప్రొటీన్లు లభ్యమయ్యాయి. నాటి కుక్కలు భూమిపైనే వేటాడేవి తప్పితే సాల్మన్ చేపల్ని పట్టుకోవడం కష్టమని.. కచ్చితంగా అవి మనుషులతో కలిసి జీవించినవేనని పరిశోధకులు తేల్చారు.
Similar News
News November 8, 2025
దేశంలోనే మొదటి పురోహితురాలు

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.
News November 8, 2025
రాజ్‌తో ఫొటో వైరల్.. సమంత రెండో పెళ్లిపై చర్చ!

సమంత నిన్న రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా ఉన్న <<18228781>>ఫొటోను<<>> షేర్ చేయడంతో పెళ్లి ఎప్పుడనే చర్చ మొదలైంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ నుంచి సమంత, రాజ్ స్నేహం మొదలైంది. అప్పటినుంచి వీరిద్దరూ డేట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని బాలీవుడ్ మీడియా ఎప్పటినుంచో కోడై కూస్తోంది.
News November 8, 2025
రబీ వరి సాగు విధానం.. విత్తన మోతాదు

☛ నారు నాటే పద్ధతి – 20 కిలోల విత్తనం అవసరం.
☛ ఎద పద్ధతి – 12-15 కిలోలు(మండి కట్టిన విత్తనం), 25-30 కిలోలు( పొడి విత్తనం)
☛ శ్రీవరి సాగు పద్ధతి – 2 కిలోల విత్తనం అవసరం.
☛ యాంత్రిక పద్ధతిలో వరి సాగుకు 10-12 కిలోల విత్తనం
☛ బెంగాల్ పద్ధతిలో వరి సాగు 8-10 కిలోల విత్తనం కావాలి.
☛ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. కిలో పొడి విత్తనాలకు 3గ్రాముల కార్బండిజమ్‌తో శుద్ధి చేయాలి.


