News December 6, 2024
రికార్డు సృష్టించిన బుమ్రా

టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించారు. అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఖవాజాను ఔట్ చేయడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారు. దీంతో భారత టెస్టు చరిత్రలో ఒకే ఏడాదిలో 50 టెస్టు వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఆయన నిలిచారు. గతంలో కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించారు.
Similar News
News April 1, 2026
7.30 గంటల నిడివితో ధురంధర్!

కంటెంట్, అధిక రన్ టైమ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ‘ధురంధర్’ మేకర్స్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన CBFC సర్టిఫికెట్ SMలో వైరలవుతోంది. OTTలో విడుదల చేస్తారా? థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. గతేడాది ‘బాహుబలి: ది ఎపిక్’ 3 గంటల 44 నిమిషాలతో రిలీజైన విషయం తెలిసిందే.

‘అతిరథ మహారథులు’ అంటే ఎవరు?

ఏదైనా రంగంలో సమర్థులు, శక్తిమంతుల గురించి చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతున్నాం. ఇది పురాణాల నుంచి వచ్చింది. యుద్ధ నైపుణ్యాలను బట్టి వీరులకు 5 స్థాయులుంటాయి. రథి అంటే ఒకేసారి 5వేల మందితో యుద్ధం చేసేవాడు. అతిరథి అంటే రథికి 12 రెట్లు, మహారథి అంటే 12 అతిరథులతో సమానం. అతి మహారథి అంటే 12 మహారథుల శక్తి గలవాడు. మహామహారథి అంటే మహారథికి 24 రెట్లు. వీరందరినీ కలిపి అతిరథ మహారథులుగా పిలిచేవారు.
<<-se>>#EPICSAYINGS<<>>