News December 6, 2024

గుంటూరు: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.! 

image

గుంటూరు లక్ష్మీపురంలోని ఓ స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్కడ జరుగుతున్న ఉదంతాన్ని చూసి పొలీసులే కంగుతిన్నారు. ఈ క్రమంలో సెంటర్ లోపల ఉన్న పలువురు యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువగా యువతులు ఉండటం గమనార్హం. 

Similar News

News December 27, 2024

తాడేపల్లిలో రైల్వే కోడూరు కానిస్టేబుల్ మృతి

image

రైల్వే కోడూరుకు చెందిన కానిస్టేబుల్ రాజయ్య గురువారం తాడేపల్లిలో మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం గుంటూరు జిల్లా తాడేపల్లికి వెళ్లారు. డ్యూటీలో అస్వస్థతకు గురవ్వగా.. గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘రాష్ట్రానికి క్యూ కడుతున్న దిగ్గజ ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు’

image

అమరావతి: గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రగతిశీల ఆలోచనలతో గత ఆరునెలల్లో రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలను పరుగులు తీయిస్తామని యువనేత నారా లోకేశ్ అన్నారు. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రాన్ని ఐటి హబ్ గా మార్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు.