News December 6, 2024

పుష్ప-2 మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

image

‘పుష్ప-2’ సినిమాలోనివి అంటూ ఫేక్ డైలాగ్స్ ప్రచారం చేసే వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని మైత్రీ సంస్థ ప్రకటించింది. ‘ఊహాజనితమైన, సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2లోనివి అంటూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పెట్టడం మానేయండి’ అని ట్వీట్ చేసింది. పైరసీపై వాట్సాప్‌లో(8978650014) రిపోర్ట్ చేయాలని కోరింది.

Similar News

News March 28, 2026

TN ఎన్నికల బరిలో నటుడు సుందర్

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్టర్, నటుడు సుందర్ తొలిసారి పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి(న్యూ జస్టిస్ పార్టీ) అభ్యర్థిగా మధురై సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. తన భర్తకు సపోర్ట్ చేయాలని బీజేపీ నేత, నటి ఖుష్బూ అభిమానులు, స్నేహితులను కోరారు. 30 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయడమే సుందర్ లక్ష్యమని తెలిపారు.
<<-se>>#ELECTIONS2026<<>>

News March 28, 2026

IPL ప్రసారాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం ఎత్తివేత

image

బంగ్లాదేశ్‌లో IPL ప్రసారంపై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపాన్ ప్రకటించారు. ముస్తాఫిజుర్‌ను తొలగించారన్న కారణంతో యూనస్ ప్రభుత్వం IPLను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ లేదా వేరే ఏ ఛానల్ ప్రసారం చేసినా అనుమతిస్తామని జహీర్ తెలిపారు. బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు.

News March 28, 2026

ఆంధ్రా అమ్మాయిలు అదరగొట్టారు

image

న్యూఢిల్లీ వేదికగా జరిగిన బధిర అమ్మాయిల T10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఆంధ్రా జట్టు సొంతం చేసుకుంది. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆంధ్రా 73/4 స్కోర్ చేయగా, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 68/4 స్కోర్ మాత్రమే చేసి ఓడిపోయింది. టోర్నీలో రాణించిన కాంతమ్మకు ఉమెన్ ఆఫ్ ది సిరీస్, ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.