News December 7, 2024

నాలెడ్జ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

image

సాంకేతికత అభివృద్ధికి దోహద పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్‌లో సీఎం పాల్గొన్నారు.1996లో ఐటీ గురించి మాట్లాడిన తను ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచామన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకొకసారి డీప్ టెక్‌ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు.

Similar News

News December 27, 2024

వాల్తేరు డీఆర్ఎంగా లలిత్ బోహ్రా

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు పరిధిలో వాల్తేరు డివిజన్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆయన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వాల్తేరు డీఆర్ఎంగా పనిచేసిన సౌరబ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. అప్పటినుంచి ఏడీఆర్ఎం ఇన్‌ఛార్జ్ డీఆర్ఎంగా పనిచేస్తున్నారు.

News December 27, 2024

విశాఖ: ‘నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిపివేత’

image

భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఏపీజీవీబీ ఆంధ్రా, తెలంగాణ విభాగాల విభజన దృష్ట్యా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఎస్.సతీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

News December 27, 2024

కుల‌గ‌ణ‌న‌పై స‌చివాల‌యాల ప‌రిధిలో సామాజిక స‌ర్వే: విశాఖ జేసీ

image

జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల‌పై సమీక్ష చేసేందుకు, ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వ‌హించిన కులగ‌ణ‌న‌పై గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో సామాజిక స‌ర్వే(సోష‌ల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.