News December 7, 2024
భోజనంలో నెయ్యి తింటున్నారా?

తెలుగింటి భోజనంలో నెయ్యి ఖచ్చితంగా ఉంటుంది. నెయ్యి వెయ్యి రకాలుగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు. ఇది భోజనాన్ని రుచిగా మార్చడమే కాకుండా ఆకలిని పెంచుతుంది. అన్నవాహిక మృదువుగా మారి ఆహారం తేలికగా కిందకు జారుతుంది. ఇది అజీర్ణం, మలబద్దకం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను బలంగా, చర్మాన్ని ఆరోగ్యంగా, గుండెను పదిలంగా ఉంచుతుంది.
Similar News
News November 6, 2025
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం

TG: కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రూ.లక్షన్నర వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్‌పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.
News November 6, 2025
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 354 పోస్టులు

<
News November 6, 2025
ధాన్యం నిల్వలో తేమ శాతం ముఖ్యం

ధాన్యాన్ని నిల్వచేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గింజలలో తేమ శాతం తక్కువగా ఉంటే ధాన్యం రంగు మారదు, బూజు పట్టదు, కీటకాలు ఆశించవు. ధాన్యంలో తేమ 14%కు మించినప్పుడు, నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు ధాన్యానికి కీటకాలు, తెగుళ్లు ఆశించి నష్టం జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసేప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చీడపీడలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


