News December 7, 2024

ప్రకాశం: రెవెన్యూ సదస్సులో 640 అర్జీలు

image

జిల్లా వ్యాప్తంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన “రెవెన్యూ సదస్సు”లలో 640 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. వీటిలో ఒంగోలు డివిజన్‌లో 273, కనిగిరిలో 230, మార్కాపురంలో 137 వచ్చాయన్నారు. ఈ మొత్తం అర్జీలు 35 రకాల సమస్యలకు సంబంధించినవని ఆమె శుక్రవారం తెలిపారు. మొత్తం అర్జీలలో నాలుగింటిని అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 26, 2024

ప్రకాశం: జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా పేరయ్య

image

జిల్లా మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు గురువారం మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా గొల్లపోతు పేరయ్య, వైస్ ప్రెసిడెంట్‌గా కావేరి. రాములు, మరో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పేరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News December 26, 2024

ప్రకాశం: 6,481 హెక్టార్లలో పంట నష్టం

image

ఈ నెల 24 నుంచి 26 వరకు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో మొత్తం 6,481 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News December 26, 2024

శానంపూడిలో యువతి ఆత్మహత్య 

image

సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.