News December 7, 2024

గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు

image

ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఖాన్ యూనిస్‌లో ఉన్న శరణార్థి శిబిరంలోని ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ శిబిరం వద్ద మహిళలు, బాలికలు ఆహారం కోసం పోటీపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి ఆహారం పంపిణీ చేసింది. కానీ ఇటీవల దానిని నిలిపివేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఆహారం అందటం లేదు.

Similar News

News March 16, 2026

పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

image

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.

News March 16, 2026

జింకు ఫాస్పేట్‌ ఎరతో ఎలుకల నివారణ

image

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.

News March 16, 2026

ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ సినిమా ఇదే

image

‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. లాస్ ఏంజెలిస్‌లో జరుగుతున్న అకాడమీ వేడుకలో విజేతగా నిలిచింది. ‘టైటానిక్’ హీరో డికాప్రియో ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమాలో నటనకు షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా, కాస్టింగ్‌ విభాగంలో కస్సాండ్రా అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా మైకేల్ బి జోర్డాన్(సిన్నర్స్), ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ(హామ్నెట్) నిలిచారు.