News December 7, 2024
VZM: జిల్లాలో నేడు జరగనున్న ముఖ్య కార్యక్రమాలు ఇవే

➤శనివారం ఉదయం 8.45 గంటలకు సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని కలెక్టర్ అంబేద్కర్ ప్రారంభిస్తారు➤ఉదయం 9-00 గంటలకు మలిశర్లలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారు ➤ఉదయం 9-00 గంటలకు జామి మండలం కుమరాంలో మెగా టీచర్స్, పేరెంట్స్ డే కార్యక్రమంలో మంత్రి కొండపల్లి పాల్గొంటారు ➤ఉదయం 10-30 గంటలకు కలెక్టరేట్‌లో క్షయ వ్యాధి నియంత్రణ పై వంద రోజుల క్యాంపెయిన్ ప్రారంభం
Similar News
News February 28, 2026
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రావివలసలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 3,280 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ జరిగిందని, రబీ-ఖరీఫ్‌లలో మరింత సాగు పెంపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో భాగంగా ఫుడ్ పార్కులు, ఐటీ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూములు గుర్తించినట్లు వివరించారు.
News February 28, 2026
సీఎం పర్యటన విజయవంతం: VZM కలెక్టర్

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఘనంగా.. విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, జేసీ సేధు మాధవన్, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యటనను నిర్వహించామని పేర్కొన్నారు.
News February 28, 2026
రౌడీల్లారా.. రాష్ట్రాన్ని విడిచి పలాయనం చేయండి: సీఎం

అలర్లు, దౌర్జన్యాలు, రౌడీయిజంతో బతికేద్దామనుకున్నవారు తక్షణమే రాష్ట్రాన్ని విడిచి పారిపోవాలని సీఎం చంద్రబాబు శనివారం జరిగిన రావివలస సభలో హెచ్చరించారు. మత్తులో తప్పు చేసే గంజాయి మూకలను చిత్తు చేస్తామన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చెడు దారిలో వెళుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించి దారిలో పెడతామని స్పష్టం చేశారు.


