News December 7, 2024

విజయనగరం: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

image

విజయనగరం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. దత్తిరాజేరు మండలం పేదమానాపురంలో సంత జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వంగరకు చెందిన గెంజి మహేశ్, తిరండి నరసింహారావు, కొలుసు రమణ గొర్రెలతో సంతకు బయల్దేరారు. ఈక్రమంలో పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్తున్న RTC బస్సు వీరిని ఢీకొట్టింది. మహేశ్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి.

Similar News

News November 8, 2025

VZM: ఈనెల 12న YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, మెడికల్ కాలేజీకి మాత్రం నిధులు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు.

News November 8, 2025

యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు

image

విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జమ్ము నారాయణపురం గ్రామం వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా బైక్ నుజ్జునుజ్జు అయింది. గాయపడిన ఇద్దరిని 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన వారని స్థానికులు తెలిపారు.

News November 8, 2025

వసతి గృహంలో విద్యార్థులతో కలిసి ఎంపీ కలిశెట్టి రాత్రి బస

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన పుట్టిన రోజును శుక్రవారం పూసపాటిరేగ మండలం కొప్పెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేసిన ఎంపీ.. రాత్రి కూడా అక్కడే విద్యార్థుల మధ్య బస చేశారు. తన జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతృప్తినిచ్చిందని ఎంపీ పేర్కొన్నారు.