News December 7, 2024
GOOD NEWS.. రూ.300కే ఇంటర్నెట్

TG: రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకూ అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ రేపు దీనిని ప్రారంభిస్తారు. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్, టెలిఫోన్, పలు OTTలు చూడవచ్చు. 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ వస్తుంది. త్వరలోనే అన్ని గ్రామాలకు దీనిని విస్తరించనున్నారు.
Similar News
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<