News December 7, 2024
IND vs AUS: వికెట్లు తీస్తేనే నిలిచేది..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. అలాగే తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా బౌలర్లు ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు. త్వరగా వికెట్లు పడగొడితేనే భారత్ తిరిగి ఆటలోకి వస్తుంది. లేదంటే ఆసీస్ భారీ ఆధిక్యంలోకి వెళ్లి భారత్ ఓడిపోయే ఛాన్స్ ఉంది. ఈ మైదానంలో ఆసీస్ రికార్డు గొప్పగా ఉంది. ఇక్కడ మొత్తం 7 మ్యాచులు ఆడి అన్నీ గెలిచింది.
Similar News
News November 4, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<
News November 4, 2025
లాబీయింగ్ చేస్తేనే నేషనల్ అవార్డులు: ప్రకాశ్‌రాజ్

లాబీయింగ్ చేసేవారికే నేషనల్ అవార్డులు వస్తున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి జాతీయస్థాయి గుర్తింపు రాకపోవడం విచారకరమన్నారు. లాబీయింగ్‌తో వచ్చే అవార్డులు ఆయనకు అవసరం లేదని చెప్పారు. కేరళ జ్యూరీలో ఛైర్మన్‌గా తనకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పి తరువాత సభ్యులు జోక్యం చేసుకున్నారని అక్కడి ఫిలిం అవార్డుల ప్రదానం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
News November 4, 2025
ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి జరిగితే మేమొస్తాం: బీజేపీ

తన కొడుకు పెళ్లి అన్నట్లుగా బిహార్‌లో ప్రధాని మోదీ తిరుగుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయ దిగజారుడుతనమని మండిపడింది. రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి సెటైర్లు వేసింది. ‘ఖర్గేజీ మీ కాంగ్రెస్ యువరాజు (రాహుల్) పెళ్లి ఎప్పుడైనా జరిగితే మేం కచ్చితంగా హాజరవుతాం’ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.


