News December 7, 2024

కస్టమర్లకు షాక్: కార్ల ధరలు పెంచిన మరో కంపెనీ

image

M&M కార్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే DEC లోపు కొనేయండి. ఎందుకంటే 2025 JAN 1 నుంచి ధరలను 3% మేర పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ద్రవ్యోల్బణం, ముడి వనరులు, వాహనం విడిభాగాల ధరల పెరుగుదలే ఇందుకు కారణమని తెలిపింది. ఈ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదంది. ఈ రెండ్రోజుల్లోనే మారుతీ సుజుకీ, హ్యూందాయ్ మోటార్స్, JSW MG మోటార్స్ ధరలు పెంచడం తెలిసిందే. మిగిలిన కంపెనీలూ ఇదే దారి అనుసరించే అవకాశముంది.

Similar News

News November 7, 2025

ఎగుమతులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ సదస్సు

image

AP నుంచి ఎగుమతులు పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలో ‘ఏపీ గ్లోబల్ MSME ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ సమ్మిట్’ నిర్వహించనుంది. బ్రిటన్, రష్యా, ఆస్ట్రియా, జపాన్, హంగేరీ, ఈజిప్ట్, న్యూజిలాండ్, ఉగాండా, జింబాబ్వేతోపాటు 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని సంస్థలు తయారుచేసే ఉత్పత్తులు, వాటి ఎగుమతుల అవకాశాలను అధికారులు వివరిస్తారు.

News November 7, 2025

అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీలో మార్పులు

image

AP: శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు అలర్ట్. వారికి టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం రోజూ 750 టికెట్లను ఆన్‌లైన్ డిప్ విధానంలో జారీ చేస్తుండగా, ఈ విధానాన్ని రద్దు చేసింది. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో టికెట్లు కేటాయించనుంది. ఇకపై 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది.

News November 7, 2025

సచివాలయాల పేరును మార్చలేదు: CMO

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.