News December 7, 2024
BRS, కాంగ్రెస్, రేపు మరో పార్టీ తెలంగాణ తల్లిని మార్చొద్దంటే..

తెలంగాణ తల్లి.. ఒక పార్టీనో, ఒక వర్గాన్నో ప్రతిబింబించేది కాదు. ఈ నేల, ఇక్కడి ప్రజలు, వనరులు, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల ఉనికికి ప్రతిరూపం. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ అంతకుముందున్న పార్టీ రూపొందించిన విగ్రహం అందర్నీ ప్రతిబింబించదని మార్చేస్తానంటే జాతి నవ్వుల పాలవుతుంది. అందుకే పదేపదే మార్చకుండా చట్టసభల్లో చర్చించి, అందరూ ఆమోదించాక ప్రతిష్ఠిస్తే మేలని మేధావులు అంటున్నారు. మీరేమంటారు?
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


