News December 7, 2024

మిస్టీరియస్ వ్యాధి.. 143 మంది మృతి

image

DR కాంగో దేశంలో మిస్టీరియస్ వ్యాధి కలకలం రేపుతోంది. చికిత్స లేని ఈ రోగం బారినపడి నవంబర్‌లో 143 మంది మరణించారు. బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, అనీమియా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో WHO హై అలర్ట్ ప్రకటించింది. అక్కడికి స్పెషల్ టీమ్‌ను పంపింది. ‘మేం ఏ వ్యాధితో పోరాడుతున్నామో అర్థం కావట్లేదు. అది వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది తెలియదు’ అని అధికారులు తెలిపారు.

Similar News

News December 27, 2024

ఇద్దరు మహానుభావులను కోల్పోయాం

image

మాజీ ప్రధాని, ఆధునిక భారత పితామహుడిగా పేరొందిన మన్మోహన్ సింగ్‌ను కోల్పోవడం దేశానికి తీరనిలోటు అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మరణించడంతో ఇద్దరు మహానుభావులను కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు.

News December 27, 2024

డెడ్ బాడీ పార్శిల్.. మిస్టరీ వీడింది

image

AP: ప.గో జిల్లా యండగండిలో డెడ్ బాడీ పార్శిల్ కేసు కొలిక్కి వచ్చింది. వదిన ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ ఓ అమాయకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శవం పేరుతో వదిన తులసిని భయపెట్టాలని చూసిన శ్రీధర్.. ఎవరూ లేని బర్రె పర్లయ్యను చంపేశాడని తెలిపారు. డెడ్ బాడీని పార్శిల్ చేసి అదే రోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు. వర్మతో పాటు భార్యలు రేవతి, సుష్మను పోలీసులు అరెస్టు చేశారు.

News December 27, 2024

CA ఫలితాలు.. మనోళ్లే టాప్ ర్యాంకర్స్

image

ఛార్టెడ్ అకౌంటెంట్స్(CA) తుది ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు <>icai.nic.in<<>> వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన హేరంబ్ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్ 508 మార్కులతో సంయుక్తంగా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. కాగా ఈ ఏడాది నవంబర్ 3, 5, 7వ తేదీల్లో సీఎ ఎగ్జామ్స్ జరిగాయి.