News December 7, 2024

ఆస్ట్రేలియా ఆలౌట్.. 157 పరుగుల ఆధిక్యం

image

భారత్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ట్రావిస్ హెడ్(140) సెంచరీతో రాణించారు. బుమ్రా, సిరాజ్ చెరో 4 వికెట్లతో రాణించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్సులో 180 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Similar News

News February 5, 2025

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

TG: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 32 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేసవిని తలపిస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు కాస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వారంపాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 5, 2025

Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.

News February 5, 2025

కనిపించని కళాఖండానికి రూ.15లక్షలు!

image

కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్‌ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.

error: Content is protected !!