News December 7, 2024
పృథ్వీ షా తల్లి లేని బిడ్డ: మాజీ కోచ్

క్రికెటర్ పృథ్వీ షాపై విమర్శలు అన్యాయమని అతడి చిన్ననాటి కోచ్ రాజు పాఠక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారిది చాలా పేద కుటుంబం. పృథ్వీ చాలా కష్టపడ్డాడు. మంచీచెడూ చెప్పేందుకు తల్లి లేదు. చిన్నతనంలోనే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. రోజు ఎలా గడవాలన్న స్థితి నుంచి ఒక్కసారిగా డబ్బు వచ్చిపడటంతో లైఫ్‌ను ఎంజాయ్ చేశాడు. కానీ పాతికేళ్ల కుర్రాడు 40 ఏళ్లవాడిలా ప్రవర్తించాలని అందరూ కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News November 9, 2025
ప్రచారానికి వాళ్లు దూరమేనా!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారానికి దూరమైనట్లేనని సమాచారం. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా ఆయన వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆ బాధ్యతలను కేటీఆర్ భుజాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు. అటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అన్నామలై, పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వస్తారని పేర్కొన్నా ఇప్పటి వరకు వారి జాడే లేదు.
News November 9, 2025
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు చేయకండి

మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం. అయితే కొన్ని పొరపాట్లు ఆ శక్తిని ప్రతికూలంగా మారుస్తాయట. ‘మనీ ప్లాంట్ ఎండిపోకూడదు. ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ ఉండాలి. లేకపోతే ధన నష్టానికి అవకాశముంది. ఈ ప్లాంట్‌ను ఇంటి లోపల పెంచడం ఉత్తమం. ప్రధాన ద్వారం బయట, మెయిన్ డోర్‌కు ఎదురుగా ఉంచకూడదు. ఈ నియమాలతో డబ్బు ప్రవాహం పెరుగుతుంది’ అని నిపుణులు సూచిస్తున్నారు.
News November 9, 2025
మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ హింస సరికాదు: జస్టిస్ సూర్యకాంత్

సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న హింసను కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. వారి ప్రతిష్ఠకు హాని కలగకుండా నిర్ధిష్టమైన సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ 31వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతికతను వాడుకొని వారి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, వారిని ట్రోలింగ్ సరైన చర్య కాదని పేర్కొన్నారు.


