News December 7, 2024

నాలుగు రోజుల వ్యవధిలో 2 సార్లు కంపించిన భూమి

image

TG: రాష్ట్రంలో భూప్రకంపనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 4న ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలలో ఈ స్థాయిలో కంపించడం ఇదే తొలిసారి. తాజాగా మహబూబ్‌నగర్‌లో భూమి కంపించడం ప్రజల్లో భయాన్ని తీవ్రం చేస్తోంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని చెబుతున్నారు.

Similar News

News November 6, 2025

మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

image

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్‌లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.

News November 6, 2025

ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

image

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News November 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

image

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>