News December 7, 2024
భారత్‌కు కొనసాగుతున్న ‘హెడ్’ఏక్

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ తన ప్రత్యర్థి భారత్ అయితే చాలు రెచ్చిపోతుంటారు. ఇప్పుడు BGTలోనూ తన రికార్డును కొనసాగిస్తున్నారు. అడిలైడ్ టెస్టులో 111 బంతుల్లోనే సెంచరీ కొట్టి డే నైట్ టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు. డే-నైట్ టెస్టుల్లో 3 సెంచరీలు హెడ్ పేరిట ఉన్నాయి. కాగా గత ఏడాది వరల్డ్ కప్ ఫైనల్, టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్ విజయాన్ని హెడ్ సెంచరీలతో అడ్డుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 9, 2025
ఘట్టమనేని జయకృష్ణ మూవీ ప్రారంభం

దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ(రమేశ్ బాబు కుమారుడు) ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. #AB4 వర్కింగ్ టైటిల్‌తో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గొప్ప ప్రేమ కథతో ఈ సినిమా రూపొందనుందని డైరెక్టర్ తెలిపారు.
News November 9, 2025
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో 13 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా, టెన్త్, ఐటీఐ/NTC/NAC అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.nrsc.gov.in
News November 9, 2025
ఫ్లోరైడ్ ప్రభావంతో మందగిస్తున్న తెలివితేటలు

బాల్యంలో ఫ్లోరైడ్ ప్రభావానికి గురికావడం వల్ల పిల్లల తెలివితేటలు మందగిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడైంది. బావులు, బోరుబావుల నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. అయితే పళ్లు పుచ్చిపోకుండా ఉండటానికి కొన్ని టూత్ పేస్టుల్లో కూడా ఫ్లోరైడ్‌ను కలుపుతారు. కాబట్టి పిల్లలు టూత్‌పేస్ట్‌లను మింగకుండా చూసుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


