News December 7, 2024

181.6 కి.మీ వేగంతో బంతి విసిరిన సిరాజ్! నిజమేనా?

image

టెస్టు క్రికెట్లో అత్యంత వేగవంతమైన బాల్ విసిరిన ఘనత ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. 2015లో న్యూజిలాండ్‌పై 160.4 కిలోమీటర్ల వేగంతో స్టార్క్ బాల్ వేశారు. తాజాగా అడిలైడ్ టెస్టులో భారత బౌలర్ సిరాజ్ ఏకంగా 181.6 కి.మీ వేగంతో బాల్ వేసినట్లు స్పీడ్ గన్‌లో నమోదయ్యింది. అయితే అది స్పీడ్ గన్‌లో లోపం వల్ల జరిగిందని తర్వాత నిర్వాహకులు తేల్చారు. దీంతో సిరాజ్‌పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News December 30, 2025

ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

image

HYDలోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(<>IICT<<>>)లో 10 టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, టెక్నీషియన్(జనరల్ నర్సింగ్/ANM), ఫార్మసీ టెక్నీషియన్, టెక్నీషియన్( క్యాటరింగ్ & హాస్పిటాలిటీ) పోస్టులు ఉన్నాయి. నెలకు జీతం రూ.39,545 చెల్లిస్తారు. ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in

News December 30, 2025

బంగ్లా మాజీ ప్రధాని మృతి.. మోదీ దిగ్భ్రాంతి

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి, బంగ్లా ప్రజలకు సంతాపం తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. బంగ్లా మొదటి మహిళా ప్రధానిగా ఆమె ఇండియాతో సంబంధాలు, అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. 2015లో ఖలీదాతో సమావేశమయ్యానని గుర్తు చేసుకున్నారు.

News December 30, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,800 పతనమై రూ.1,24,850 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.23వేలు తగ్గి కిలో రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.