News December 7, 2024
అర్ధరాత్రి వరకు నిద్ర పోవట్లేదా?

రాత్రి సమయంలో లేటుగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని అధ్యయనాల్లో తేలింది.
Similar News
News July 5, 2025
ఒకట్రెండు రోజుల్లో KCR ప్రెస్‌మీట్!

TG: అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ సీఎం KCR నిన్న యశోద ఆసుపత్రిలోనే పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయటపెడతానని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఒకట్రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ ఉ.11 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
News July 5, 2025
పరీక్షల తేదీలు వచ్చేశాయి

AP: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షల సవరణ <
News July 5, 2025
B2 బాంబర్స్‌తో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

249వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అమెరికా వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా B2 స్టెల్త్ బాంబర్స్ వైట్‌హౌస్ మీదుగా దూసుకెళ్లాయి. వాటికి బాల్కనీ నుంచి సతీమణి మెలానియాతో పాటు ట్రంప్ సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ Xలో పోస్ట్ చేసింది. కాగా ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా ఆర్మీ ఈ B2 బాంబర్స్‌తోనే దాడి చేసింది.