News December 8, 2024
‘పుష్ప’ తరహాలో బంగాళదుంపల స్మగ్లింగ్

పశ్చిమ బెంగాల్‌లో బంగాళదుంపల ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. కాగా వ్యాపారులు ‘పుష్ప’ మూవీ తరహాలో వాటిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. బెంగాల్, ఝార్ఖండ్ సరిహద్దులో రెండ్రోజుల్లో పోలీసులు 20కి పైగా లారీలను సీజ్ చేశారు. వాహనాల పైభాగంలో పశువుల మేత, కింద బంగాళదుంపల బస్తాలను అమర్చి కొందరు చేస్తున్న స్మగ్లింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
Similar News
News September 16, 2025
ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు అధికారులను సన్నద్ధం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. 2002లో జరిగిన ఎస్.ఐ.ఆర్ డేటాను ప్రస్తుత 2025 జాబితాతో పోల్చి తప్పుడు వివరాలను గుర్తించి సరిదిద్దాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ప్రతి బూత్ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించి, ప్రతిరోజు లక్ష్యాలతో కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
News September 16, 2025
వరికి అధికంగా యూరియా వేస్తున్నారా?

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
News September 16, 2025
‘ఆరోగ్యశ్రీ’ బంద్.. చర్చలకు అంగీకరించని సర్కార్

TG: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఇప్పటికే ₹140 కోట్ల బకాయిల్లో ₹100 కోట్లు విడుదలయ్యాయి. 150 కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతాయి. ఎమర్జెన్సీ సేవలు అందుతాయి. మిగతా 330 చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయి’ అని హెల్త్ మినిస్టర్ కార్యాలయ అధికారి Way2Newsకు తెలిపారు.