News December 8, 2024

HYDలో రోడ్డు ప్రమాదం.. బెల్లంపల్లి విద్యార్థి మృతి

image

HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ బస్తీ 17వ వార్డుకు చెందిన రవితేజ (21) హైదరాబాదులో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి బైక్ పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కింద పడ్డాడు. వెనకాల వస్తున్న లారీ అతనిపై నుంచి వెళ్లింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News March 2, 2026

ADB: ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం

image

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెల్త్ మిషన్ – 100’ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో హెల్త్ మిషన్ – 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.

News March 2, 2026

ఆదిలాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల స్వీకరణ

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.

News March 2, 2026

ఆదిలాబాద్: కలెక్టరేట్‌లో దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.