News December 8, 2024
ఆసియా కప్ ఫైనల్ నేడు.. భారత్, బంగ్లాదేశ్ ఢీ

దుబాయ్ వేదికగా నేడు అండర్-19 ఆసియా కప్ తుదిసమరం జరగనుంది. ఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్ పోటీ పడనున్నాయి. 8సార్లు కప్ గెలిచిన భారత్ ఓ వైపు, డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ మరోవైపు విజయం కోసం వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఇండియా టీమ్‌లో 13ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్‌లో అదరగొడుతుండగా, ఆయుశ్ మెరుగైన సహకారం అందిస్తున్నారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో పటిష్ఠంగా కనిపిస్తుండటంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది.
Similar News
News November 12, 2025
CMగా తేజస్వీ వైపే ప్రజల మొగ్గు: Axis My India

బిహార్‌లో ఎన్డీయే గెలుస్తుందని Axis My India <<18269672>>ఎగ్జిట్ పోల్<<>> సర్వే అంచనా వేసింది. అయితే CMగా ఎవరైతే బెటర్ అనే విషయంలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కంటే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపినట్లు తెలిపింది. తేజస్వీకి 34%, నితీశ్‌కు 22% మంది మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. బీజేపీ అభ్యర్థికి 14%, చిరాగ్ పాస్వాన్‌కు 5% మంది సపోర్ట్ చేయడం గమనార్హం.
News November 12, 2025
ఒక్కో అంతస్తు ఎన్ని అడుగులు ఉండాలి?

ఇంటి నిర్మాణంలో ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం 10.5 నుంచి 12 అడుగుల మధ్య ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ కొలత పాటించడం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయంటున్నారు. ‘ఇది ఇంట్లో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచి, నివాసితులకు ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తక్కువ ఎత్తు ఉన్న అంతస్తులు నిరుత్సాహాన్ని, ఇరుకుతనాన్ని కలిగిస్తాయి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 12, 2025
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.


