News December 8, 2024
యాక్సిడెంట్.. ఇద్దరు మిత్రులు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని షేట్బషీరాబాద్లో జరిగింది. పల్నాడు జిల్లా రాజులపాలెం గ్రామానికి చెందిన అనీల్(25), HYDలో ఉంటున్న కార్తీక్ రెడ్డి(26) స్నేహితులు. అయ్యప్ప మాలలో ఉన్న వీరు శుక్రవారం శబరిమల వెళ్లి తిరిగొచ్చారు. అదే రోజు రాత్రి బైక్పై వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. కార్తీక్ అక్కడికక్కడే చనిపోగా అనీల్ ఆస్పత్రిలో మృతి చెందాడు.
Similar News
News December 27, 2024
తాడేపల్లిలో రైల్వే కోడూరు కానిస్టేబుల్ మృతి
రైల్వే కోడూరుకు చెందిన కానిస్టేబుల్ రాజయ్య గురువారం తాడేపల్లిలో మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం గుంటూరు జిల్లా తాడేపల్లికి వెళ్లారు. డ్యూటీలో అస్వస్థతకు గురవ్వగా.. గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 27, 2024
‘రాష్ట్రానికి క్యూ కడుతున్న దిగ్గజ ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు’
అమరావతి: గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రగతిశీల ఆలోచనలతో గత ఆరునెలల్లో రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలను పరుగులు తీయిస్తామని యువనేత నారా లోకేశ్ అన్నారు. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రాన్ని ఐటి హబ్ గా మార్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు.
News December 27, 2024
గుంటూరు పరేడ్ గ్రౌండ్లో దేహధారుడ్య పరీక్షలు
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుణ్య పరీక్షలకు గుంటూరు పోలీస్ పరేడ్ మైదానాన్ని సిద్ధం చేయమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఐపీఎస్ ఆదేశించారు. డిసెంబర్ 30న పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం నగరంలోని మైదానాన్ని ఎస్పీ పరిశీలించారు. అభ్యర్థులకు ప్రతి పరీక్ష ఘట్టం అర్థమయ్యే రీతిలో మైదానంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు SPలు GV రమణమూర్తి, సుప్రజ పాల్గొన్నారు.