News December 8, 2024

రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలిస్తుంది.

Similar News

News February 7, 2026

100లో 31 మాత్రమే స్మార్ట్ సిటీలుగా మారాయ్!

image

100 నగరాల్లో కేవలం 31 మాత్రమే ఇప్పటి వరకు స్మార్ట్ సిటీలుగా మారినట్లు కేంద్రం ఓ RTIకి సమాధానమిచ్చింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటీ లేవు. ఈ నగరాల కోసం పదేళ్లలో ₹59,385Cr ఖర్చు చేసింది. వైజాగ్ సహా మరో 43 నగరాల్లో పనులు దగ్గరపడినట్లు తెలిపింది. కాకినాడ, తిరుపతితో పాటు 26 పట్టణాలు స్మార్ట్ సిటీస్‌గా మారేందుకు టైమ్ పడుతుందని పేర్కొంది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది.

News February 7, 2026

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ తమిళం: మోదీ

image

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప వరం తమిళం అని ప్రధాని మోదీ అన్నారు. తమిళ సాహిత్యం, సంస్కృతి చాలా గొప్పవని మలేషియా పర్యటనలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. మానవాళికి తమిళ ప్రజలు తమదైన ప్రతిభతో సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇండియా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా కేంద్ర క్యాబినెట్‌లో కీలక స్థానంలో తమిళులు ఉండడం గర్వంగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత సంస్కృతి అని గుర్తుచేశారు.

News February 7, 2026

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ డెడ్‌లైన్

image

రష్యాతో తమ యుద్ధాన్ని జూన్ నాటికి ముగించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డెడ్‌లైన్ విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. అందుకోసం వచ్చేవారం మరో దఫా చర్చలు జరిపేందుకు ఇరు పక్షాలనూ USకు ఆహ్వానించినట్లు చెప్పారు. దానికి తాను సమ్మతించినట్లు వెల్లడించారు. రష్యా స్టాండ్ ఏంటనేది మాత్రం తెలియదన్నారు. అబుదాబీలో ఇటీవల ముగిసిన చర్చల్లో కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరలేదని వెల్లడించారు.