News December 8, 2024
హిందీ గడ్డపై పుష్ప-2 సరికొత్త రికార్డు

పుష్ప-2 బాలీవుడ్‌లో అదరగొడుతోంది. 3 రోజుల్లోనే ₹205 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో జవాన్(₹180Cr), యానిమల్(₹176Cr), పఠాన్(₹161Cr) సినిమాలను అల్లు అర్జున్ వెనక్కు నెట్టారు. అలాగే హిందీలో తొలి 3 రోజుల్లో రెండు రోజులు ₹70Cr మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ మూవీ గురువారం ₹72Cr, శుక్రవారం ₹59Cr, శనివారం ₹74Cr సాధించింది.
Similar News
News September 16, 2025
ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేనా…?

నెల్లూరు జిల్లాలో ఎడగారుగా 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కోతలు కోసే సమయానికి వర్షాలు పడడంతో పలుచోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
News September 16, 2025
రూ.1,779 కోట్లు చెల్లించాం.. బంద్ ఆపండి: ఆరోగ్యశ్రీ సీఈవో

TG: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలను ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు చెల్లించామని తెలిపారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించామని వివరించారు.
News September 16, 2025
ఆ విగ్రహం మహావిష్ణువుది కాదు.. శనీశ్వరుడుది: AP FactCheck

AP: తిరుపతి అలిపిరిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉందంటూ YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారం అసత్యమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఆ విగ్రహం అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరునిదని స్పష్టం చేసింది. ‘విగ్రహం తయారీలో లోపం కారణంగా శిల్పి పట్టు కన్నయ్య దీనిని ఇక్కడే వదిలేశారు. పదేళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉంది. ఇలాంటి పోస్టులను ఎవరూ సోషల్ మీడియాలో షేర్, పోస్ట్ చేయవద్దు’ అని పేర్కొంది.