News December 8, 2024

రాడార్ నుంచి అల్‌-అస‌ద్ విమానం అదృశ్యం

image

సిరియా రెబల్స్ డమాస్క‌స్‌ను చుట్టుముట్టడంతో అధ్య‌క్షుడు బ‌ష‌ర్ అల్‌-అస‌ద్ కుటుంబంతో విమానంలో ప‌రార‌య్యారు. విమానం సిరియా తీర ప్రాంతం వైపు ప‌య‌నించింద‌ని తెలుస్తోంది. అయితే కొద్దిసేప‌టికే యూట‌ర్న్ తీసుకొని వ‌చ్చిన దారిలోనే తిరుగు ప్ర‌యాణమైంది. తర్వాత రాడార్ నుంచి అదృశ్యమైన‌ట్టు వార్తలొస్తున్నాయి. ఫ్లైట్‌ను బ‌ల‌వంతంగా ల్యాండ్ చేశారని తెలుస్తోంది. అసద్ ర‌ష్యా, ఇరాన్‌ను ఆశ్ర‌యం కోర‌వ‌చ్చ‌ని సమాచారం.

Similar News

News November 3, 2025

షెఫాలీ షో.. చరిత్ర సృష్టించింది

image

షెఫాలీ వర్మ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించారు. ఫైనల్లో 87 రన్స్ చేయడమే కాకుండా.. 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్ షెఫాలీ(21 ఇయర్స్) కావడం విశేషం. గాయపడిన ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన ఆమె అనూహ్యంగా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘ఏదో మంచి చేయాలనే భగవంతుడు నన్ను జట్టులోకి పంపాడు’ అంటూ షెఫాలీ ఆనందం వ్యక్తం చేశారు.

News November 3, 2025

టీమ్ ఇండియాకు ప్రధాని శుభాకాంక్షలు

image

విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు PM మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫైనల్‌లో వారి ప్రదర్శన స్కిల్, ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఈ విజయం భవిష్యత్ ఛాంపియన్‌లకు స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. ‘మన బిడ్డలు దేశాన్ని గర్వపడేలా చేశారు. ఛాంపియన్లకు అభినందనలు’ అని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఈ విన్ చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీ చరణి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది’ అని లోకేశ్ పేర్కొన్నారు.

News November 3, 2025

నవంబర్ 3: చరిత్రలో ఈరోజు

image

*1874: సాహితీవేత్త, నాటకరంగ ప్రముఖుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి జననం
*1906: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ పృథ్వీరాజ్ కపూర్ జననం
*1933: నోబెల్ బహుమతి పొందిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ జననం
*1937: ప్రముఖ సింగర్ జిక్కి జననం
*1940: విప్లవ రచయిత వరవరరావు జననం
*1998: విలక్షణ నటుడు పీఎల్ నారాయణ మరణం
*జాతీయ గృహిణుల దినోత్సవం