News December 8, 2024

రెండో వారంలో వరుస IPOలు

image

స్టాక్ మార్కెట్ల‌లోకి Mon నుంచి IPOలు క్యూక‌ట్ట‌నున్నాయి. ముఖ్యంగా Dec 11న విశాల్ మార్ట్‌, మొబిక్విక్‌, సాయి లైఫ్ సైన్సెస్ రానున్నాయి. 12న ఇన్వెంచ‌ర‌స్ నాలెడ్జ్ సొల్యూష‌న్స్, 13న ఇంట‌ర్నేష‌న‌ల్ జెమోలాజిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ రానున్నాయి. అలాగే SMEలో Dhanlaxmi Crop Science, Jungle Camps India, Toss The Coin, Purple United Sales, Supreme Facility Management, Yash High voltage ఈ వారం IPOకు రానున్నాయి.

Similar News

News September 18, 2025

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

image

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

News September 18, 2025

అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

image

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

News September 18, 2025

అర్ధరాత్రి 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

image

TG: భారీ వర్షం హైదరాబాద్ మహా నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అర్ధరాత్రైనా చాలామంది ఇళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. బేగంపేట-సికింద్రాబాద్ రూట్‌లో 5 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు హైడ్రా, ట్రాఫిక్, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.