News December 8, 2024
రామప్పకు రూ.73 కోట్ల నిధులు విడుదల

TG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.73 కోట్ల నిధులు కేటాయించింది. ఈమేరకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది. కేంద్ర పథకం కింద స్థానికంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. కాటేజీలతో పాటు గార్డెన్, యాంఫీ థియేటర్, లేక్ వ్యూ కాటేజీలు, ఆట స్థలాలు, బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు.
Similar News
News January 17, 2026
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<
News January 17, 2026
తిరుమల సప్తగిరులకు ఆ పేర్లెలా వచ్చాయంటే..?

తిరుమలలోని 7 కొండలకు విశిష్టమైన చరిత్ర ఉంది. శ్రీవారి ఆజ్ఞతో గరుత్మంతుడు తెచ్చిన గరుడాద్రి, వృషభాసురుడి పేరున వృషభాద్రి, అంజనీదేవి తపస్సు చేసిన అంజనాద్రి ప్రధానమైనవి. తొలిసారి తలనీలాలు సమర్పించిన నీలాంబరి పేరుతో నీలాద్రి, ఆదిశేషుడి పేరిట శేషాద్రి, పాపాలను దహించే వేంకటాద్రి, నారాయణుడు తపస్సు చేసిన నారాయణాద్రిగా నేడు వీటిని పిలుస్తున్నారు. ఈ ఏడు కొండలు భక్తికి, ముక్తికి నిలయాలు.
News January 17, 2026
టాస్ ఓడిన భారత్

U-19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల టాస్ కాస్త ఆలస్యమైంది. తొలుత భారత్‌దే బ్యాటింగ్ కావడంతో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, కుందు చెలరేగితే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.
IND: ఆయుష్ మాత్రే(C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్, విహాన్, కుందు, చౌహాన్, పంగాలియా, అంబరీష్, హెనిల్, దీపేశ్, ఖిలాన్ పటేల్


