News December 8, 2024

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

image

AP: భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News January 15, 2026

సంక్రాంతికి విడుదల.. ఏ సినిమాకు వెళ్లారు?

image

సంక్రాంతి అనగానే సినిమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. పండగ వేళ ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి 5 సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘MSVPG’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ జాబితాలో ఉన్నాయి. మీరు వీటిలో ఏ సినిమాకు వెళ్లారు? ఏ మూవీ నచ్చింది?

News January 15, 2026

ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో తీర్పు!

image

TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయింపునకు పాల్పడ్డారన్న MLAలు చింతా ప్రభాకర్, జగదీశ్ రెడ్డి ఫిర్యాదుపై ఇవాళ స్పీకర్ నిర్ణయం వెల్లడించనున్నారు. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్‌కు వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీరి అనర్హత పిటిషన్లపై తీర్పునకు మరింత సమయం పట్టనుంది.

News January 15, 2026

జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

image

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్‌లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్‌ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్‌తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్‌, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్‌లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.