News December 9, 2024

విజయవాడ మీదుగా శబరిమలైకు ప్రత్యేక రైళ్లు 

image

అయ్యప్ప భక్తులకై విజయవాడ మీదుగా మౌలాలి(MLY)-కొల్లామ్‌(QLN) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు 2025 జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి శనివారం MLY-QLN(నం.07171), 2025 జనవరి 6 నుంచి 27వరకు ప్రతి సోమవారం QLN-MLY(నం.07172) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

Similar News

News September 15, 2025

మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News September 14, 2025

కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ మచిలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్
☞ జగన్ ఓ డ్రామాల కింగ్: ఎంపీ
☞ గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం
☞ మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ కృష్ణాజిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!  
☞ గన్నవరం ఎయిర్పోర్ట్ బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి
☞ గన్నవరం: హాస్టల్ వంట మనిషిపై విద్యార్థుల దాడి

News September 14, 2025

మచీలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో మచీలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి మూడవ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 72 ప్రశ్నలు అడగటంతో పాటు 18 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 79.41%గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.