News December 9, 2024
రాయలసీమలో మళ్లీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News December 26, 2024
మంత్రి భరత్ కుమార్తె పెళ్లిలో సీఎం చంద్రబాబు
మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. హైదరాబాదులోని GMR అరేనలో జరిగిన ఈ వేడుకకు హాజరై వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
News December 26, 2024
శ్రీశైలానికి మంత్రి కొండా సురేఖ రాక
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి నేడు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నట్లు దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. రాత్రి 7 గంటలకు మంత్రి శ్రీశైలం చేరుకుంటారని చెప్పారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
News December 26, 2024
శిరివెళ్ళ: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
శిరివెళ్ళ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మనాభ రావువీధికి చెందిన కళ్యాణ్(25) అనే ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. నంద్యాలలోని ఏవిఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అతడు బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా కడప నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణకు చెందిన కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.