News December 9, 2024
గోకులం: ఉపాధి కూలీల వేతనాల వాటా పెంపు
AP: గోకులం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో పశువుల కొట్టాలు, గొర్రెల షెడ్లను నిర్మిస్తున్నారు. వీటికి అందించే ఆర్థిక సాయంలో కొంత వాటా కూలీలకు వేతనాల రూపంలో చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పశువుల కొట్టాల నిర్మాణంలో పాల్గొనే కూలీలకు 46 పనిదినాలకు గాను అదనంగా రూ.13,371లు చెల్లించనుంది. అలాగే గొర్రెల షెడ్లకు 67 పని దినాలకు గాను రూ.20,205లు వారి ఖాతాల్లో జమ చేయనుంది.
Similar News
News December 27, 2024
నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!
మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయనకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నిజమైన భారత రత్నం ఇతడేనని, ఈయనకు భారత అత్యున్నత పురస్కారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తుచేస్తున్నారు. సింగ్కు 1987లోనే పద్మవిభూషణ్ వరించింది.
News December 27, 2024
ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.
News December 27, 2024
బీసీ మహిళలు, యువతకు GOOD NEWS
AP: బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 80వేల మంది BC, EBC మహిళలకు 90 రోజులపాటు టైలరింగ్పై శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్టు మిషన్లు అందిస్తుంది. అలాగే డీ ఫార్మా, బీఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ₹8 లక్షలు సాయం చేయనుంది. ఇందులో ₹4 లక్షలు సబ్సిడీ, ₹4 లక్షలు రుణంగా ఉంటుంది. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.