News December 9, 2024

మంచు ఫ్యామిలీ వివాదం.. కీలక పరిణామం

image

మంచు ఫ్యామిలీలో <<14828101>>వివాదం నేపథ్యంలో<<>> ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. HYD జల్‌పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి అన్న మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వెళ్లారు. అక్కడి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ ఇంటి దగ్గర ప్రైవేట్ బౌన్సర్లను కాపలాగా పెట్టారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మంచు విష్ణు కాసేపట్లో తమ్ముడి ఇంటికి వెళ్లనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Similar News

News December 27, 2024

ఆ రోజున సెలవు రద్దు

image

TG: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా ఫిబ్రవరి 8న రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 13న భోగి, 14న సంక్రాంతికి జనరల్ హాలిడేస్ ఇచ్చింది. 15న కనుమ పండుగను ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. సెలవుల జాబితా కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News December 27, 2024

మన్మోహన్ లెగసీని కొనసాగిస్తాం: CWC

image

దేశంలో సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేసి రాజ‌కీయ, ఆర్థిక రంగాల్లో మ‌న్మోహ‌న్ సింగ్ గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావాన్ని చూపార‌ని CWC కొనియాడింది. మాజీ ప్ర‌ధాని గౌర‌వార్థం సమావేశమైన CWC ఆయ‌న నాయ‌క‌త్వ‌మే క్లిష్ట ప‌రిస్థితుల్లో దేశాన్ని ముందుకు న‌డిపింద‌ని కీర్తించింది. ఆయ‌న లెగ‌సీని కొన‌సాగిస్తామ‌ని తీర్మానించింది. శ‌నివారం ఉద‌యం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యానికి మ‌న్మోహ‌న్ భౌతిక‌కాయాన్ని త‌ర‌లించ‌నున్నారు.

News December 27, 2024

నోట్ల ర‌ద్దుపై మ‌న్మోహ‌న్ ఏమ‌న్నారంటే..

image

నోట్ల ర‌ద్దును మాన్యుమెంటల్ డిజాస్టర్‌గా మన్మోహన్ అభివ‌ర్ణించారు. న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీయ‌డానికే నోట్ల ర‌ద్దు చేశామ‌ని చెప్పిన మోదీ, మొత్తం క‌రెన్సీ న‌ల్ల‌ధ‌నమని- మొత్తం న‌ల్ల‌ధ‌నం క‌రెన్సీ రూపంలో ఉందనే త‌ప్పుడు ఊహ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ చ‌ర్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఛిద్రం చేస్తుంద‌ని అనాడు మ‌న్మోహ‌న్ చెప్పినట్టే రూపాయి విలువ ఈ రోజు జీవిత కాల క‌నిష్టానికి చేరుకుందని నిపుణులంటున్నారు.