News December 9, 2024

రామాయణ-1లో నా పార్ట్ షూటింగ్ పూర్తి: రణ్‌బీర్

image

నితేశ్ తివారీ డైరెక్షన్‌లో ‘రామాయణ’ షూటింగ్ వేగంగా సాగుతున్నట్లు రణ్‌బీర్ కపూర్ వెల్లడించారు. పార్ట్-1లో తన భాగం షూట్ పూర్తిచేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. త్వరలోనే రెండో పార్ట్ మొదలవుతుందన్నారు. రాముడి పాత్ర చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, భార్యాభర్తల బంధం గురించి ఈ చిత్రం వివరిస్తుందన్నారు. ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు.

Similar News

News November 6, 2025

రాహుల్ ఆరోపించిన చోట కాంగ్రెస్‌కే అధిక ఓట్లు

image

హరియాణాలో భారీగా ఓటు చోరీ జరిగిందని నిన్న LoP రాహుల్ గాంధీ ECపై ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. ములానా సెగ్మెంటు ఢకోలా గ్రామంలో ఒకే ఫొటో (బ్రెజిలియన్ మోడల్)తో 223 ఓట్లున్నట్లు చూపారు. అయితే 2024 పోలింగ్‌లో అక్కడ CONGకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి 275, CONGకు 602 ఓట్లు రాగా లోక్‌సభలో BJP కన్నా CONGకు 392 ఓట్లు ఎక్కువొచ్చాయి. 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్‌కే అధిక ఓట్లు పడ్డాయి.

News November 6, 2025

20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

image

బిహార్ భీమ్‌బంద్ ప్రాంతంలోని 7 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలు 20 ఏళ్ల తరువాత తొలిసారి ఓట్లు వేశారు. 2005 JAN 5న తారాపూర్‌ దగ్గర భీమ్ బంద్ ప్రాంతంలో నక్సల్స్ పోలీసులు లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. పేలుడులో ముంగేర్ SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. ఈసారి సాయుధ దళాలను మోహరించి పోలింగ్ జరిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు.

News November 6, 2025

వ్యాధులపై అపోహలు.. వైద్యుల హెచ్చరిక!

image

సాధారణ వ్యాధులపై ఉన్న అపోహలను వైద్యులు తోసిపుచ్చారు. స్ట్రోక్ వృద్ధులకే కాకుండా హై BP ఉన్న యువతకూ రావచ్చని తెలిపారు. ‘గుండెపోటు ప్రతిసారీ తీవ్రమైన నొప్పిని కలిగించదు. ‘సైలెంట్ అటాక్స్’ కూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు పని చేయవు. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కనిపించవు. రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిందే. కొన్ని లక్షణాలు తగ్గాయని మెడిసిన్స్ ఆపొద్దు’ అని వైద్యులు స్పష్టం చేశారు.