News December 9, 2024

రేవంత్ ముక్కు నేలకు రాయాలి: ఎమ్మెల్సీ కవిత

image

TG: CM రేవంత్ తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ఆవిష్కరించడం దురదృష్టకరం అని MLC కవిత అన్నారు. ఈ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని విమర్శించారు. ‘తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలనుకుంటే గన్ పార్క్ దగ్గర రేవంత్ ముక్కు నేలకు రాయాలి. ఉద్యమ కారులపై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు ఆయనకు లేదు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 27, 2024

HYDలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్ల బుకింగ్స్!

image

ఈ ఏడాదికి సంబంధించిన ఆర్డర్స్ నివేదికను స్విగ్గీ మార్ట్ విడుదల చేసింది. హైదరాబాదీలు ఈ ఏడాది 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేశారని, దాదాపు 2 లక్షల కండోమ్‌లను బుక్ చేసినట్లు పేర్కొంది. అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుల్లో పాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నట్లు తెలిపింది. నగర ప్రజలు కేవలం ఐస్‌క్రీమ్‌లకే దాదాపు ₹31 కోట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కు ₹15 కోట్లు ఖర్చు చేశారంది.

News December 27, 2024

YCPకి ఇంతియాజ్ రాజీనామా

image

AP: కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. విశ్రాంత IAS అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News December 27, 2024

RARE PHOTO: తొలి డాక్టరమ్మలు!

image

పైనున్న ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు మహిళలెవరని ఆలోచిస్తున్నారా? ఈ ముగ్గురూ వైద్యులుగా లైసెన్స్ పొందిన తొలి మహిళలు. 1885లో తీసిన ఈ ఫొటోలో ఓ భారతీయురాలు కూడా ఉండటం విశేషం. ఆమె పేరు ఆనందీబాయి జోషి(చీరలో ఉన్నారు). మరో ఇద్దరు జపాన్‌కు చెందిన కెయి ఒకామి, సిరియా నుంచి సబాత్ ఇస్లాంబూలీ. కాగా, ఆనందీబాయి 1886లో వైద్య విద్యలో పట్టా పొందారు.