News December 9, 2024

INDIA కూటమి మాటలకు చేతలకు పొంతనేది?

image

INDIA కూటమి మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. EVMలపై డౌట్లు, ప్రజలు మహాయుతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదంటూ తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారాన్ని MVA బహిష్కరించడం తెలిసిందే. ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపించిన కాంగ్రెస్, శివసేన UBT ఎమ్మెల్యేలు రెండోరోజు ప్రమాణం చేయడం విచిత్రంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ఒక్కరోజులోనే ఏం మారిపోయిందని ట్రోల్ చేస్తున్నారు.

Similar News

News September 24, 2025

‘డాక్టర్ అవ్వాలని లేదు’.. NEET ర్యాంకర్ సూసైడ్

image

మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన అనురాగ్ అనిల్ బోర్కర్ (19) అనే విద్యార్థి సూసైడ్ సంచలనంగా మారింది. మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేందుకు UP ఘోరఖ్‌పుర్ వెళ్లాల్సిన రోజే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు డాక్టర్ అవ్వాలని లేదు’ అని సూసైడ్ నోట్‌లో రాసుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనురాగ్ NEET UG- 2025 పరీక్షలో ఆల్ ఇండియా 1475(99.99 పర్సంటైల్) ర్యాంకు సాధించాడు.

News September 24, 2025

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఏ భాషనైనా ఇట్టే చదివేయొచ్చు!

image

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు ఇతర భాషల్లోని మెసేజ్‌లను కావాల్సిన భాషల్లోకి అనువదించుకోవచ్చు. దీనికోసం మెసేజ్‌పై నొక్కి పట్టుకుంటే ట్రాన్స్‌లేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి ఏ భాషలోకి అనువదించాలో దానిని ఎంచుకోండి. ఆండ్రాయిడ్ యూజర్లు అన్ని మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. *తెలుగు ఇంకా అందుబాటులోకి రాలేదు.

News September 24, 2025

ప్రతిపక్ష నేతగా గుర్తించాలని జగన్ పిటిషన్.. విచారణ వాయిదా

image

AP: తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 4కు వాయిదా వేసింది. కాగా ప్రతిపక్ష నేతగా జగన్‌ను గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫిబ్రవరి 5న రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ కోర్టుకు వెళ్లారు.