News December 9, 2024
సిసోడియా నియోజకవర్గం అవధ్ ఓజాకు

Febలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆప్ 2వ జాబితాను విడుదల చేసింది. పట్పర్‌గంజ్ MLA, సీనియర్ నేత మనీశ్ సిసోడియా ఈసారి జాంగ్‌పురా నుంచి బరిలో దిగనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన సివిల్స్ కోచింగ్ ఫ్యాకల్టీ అవధ్ ఓజా పట్పర్‌గంజ్ నుంచి పోటీ చేయనున్నారు. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది.
Similar News
News September 24, 2025
ప్రతీ జట్టు టీమ్ ఇండియాను ఓడించగలదు: బంగ్లా కోచ్

టీమ్ ఇండియాను ఓడించే సత్తా ప్రతి జట్టుకూ ఉంటుందని బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అన్నారు. మ్యాచ్ రోజున మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టే విజేతగా నిలుస్తుందని చెప్పారు. గత రికార్డులు విన్నర్‌ను డిసైడ్ చేయలేవన్నారు. మూడున్నర గంటల్లో ఆడే తీరు ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. బంగ్లా బౌలింగ్ అద్భుతంగా ఉందని ఇవాళ భారత్‌తో మ్యాచులో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
News September 24, 2025
బతుకమ్మకుంట: హైడ్రా కమిషనర్ బోటులో షికారు

TG: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో <<16988578>>హైడ్రా<<>> పునరుద్ధరించిన బతుకమ్మకుంటలో కమిషనర్ రంగనాథ్ బోటులో షికారుకెళ్లారు. ఈ నెల 26న జరగనున్న బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరును వీహెచ్ ప్రశంసించారు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి ఈ కుంటను నగర ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు.
News September 24, 2025
కాగితంపై పులిలా రష్యా.. ట్రంప్ కవ్వింపు

ఉక్రెయిన్‌తో మూడున్నరేళ్లుగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా కాగితంపై పులిలా వ్యవహరిస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. EU సహకారంతో రష్యా నుంచి భూభాగాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, చర్యలు తీసుకునేందుకు ఉక్రెయిన్‌కు ఇదే సరైన సమయమన్నారు. నాటో దేశాలకు ఆయుధాల సరఫరాను కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.