News December 9, 2024
నరసన్నపేట- ఇచ్ఛాపురం హైవేను 6 లైన్లకు విస్తరించాలి

రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగమయ్యేలా స్థానిక జిల్లా మీదుగా ఉన్న జాతీయ రహదారి -16ను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దీనికి అనుగుణంగా నరసన్నపేట – ఇచ్ఛాపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని 6 లైన్లకు విస్తరించాలని హైవే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు.
Similar News
News January 11, 2026
సంతబొమ్మాళి: వేటకెళ్లి మత్స్యకారుడు మృతి

సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ దిబ్బలమరువాడ గ్రామానికి చెందిన రామారావు(55) ఆదివారం వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. తోటి మత్స్యకారులతో సముద్రంలోకి వేటకెళ్లి ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో బోటు బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడని తోటి మత్స్యకారులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
News January 11, 2026
శ్రీకాకుళం: ఎస్పీ కార్యాలయంలో ఓబన్నకు నివాళులు

స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఆయన సేవలను నెమరువేసుకున్నారు.
News January 11, 2026
శ్రీకాకుళం: ‘గుడ్డు ధర’ ఆల్ టైమ్ రికార్డ్

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్క కోడిగుడ్డు ధర రూ.10 కి చేరింది. హోల్ సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9 పలుకుతోంది. గతంలో ఒక ట్రే (30 గుడ్లు) రూ.180- రూ.200 ఉండేవి. ప్రస్తుతం రూ.240- రూ.280కి చేరింది. ఇక నాటు కోడిగుడ్డు రూ.15-20 వరకు పలుకుతోంది. ఈ సీజన్లో ఎగ్స్ ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు.


